మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

September 21, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో పీజీ కోర్సుల అప్లియోషన్ ఫీజు చెల్లింపునకు ఆర్థిక సహాయం గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల భైంసాలో 2026–27 విద్యా సంవత్సరానికి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రారంభమైన ఎం.ఏ. ఇంగ్లీష్, ఎం.కామ్. పీజీ కోర్సులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ 110200ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, ముధోల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలన్న తన సంకల్పంలో భాగంగా గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పీజీ కోర్సులు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా, స్థానికంగానే నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో పీజీ కోర్సుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే పీజీ కోర్సులకు అనుమతులు లభించడం, విద్యార్థులకు ప్రవేశాలు అందుబాటులోకి రావడం కళాశాల అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ, కళాశాలలో పీజీ కోర్సులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రామారావు పటేల్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. పీజీ కోర్సుల అప్లిహేషన్ ఫీజు చెల్లింపునకు సైతం ఆర్థిక సహాయం అందించడం ఆయన విద్య పట్ల ఉన్న నిబద్ధత, దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. కళాశాలకు ఎలాంటి అవసరం వచ్చినా “తానున్నాను” అంటూ అండగా నిలుస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper