వినాయక మండపాల్లో శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు.అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు
పయనించే సూర్యుడు న్యూస్ – సెప్టెంబర్ 21 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డికూకట్‌పల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ రోడ్డు నంబర్ 8సీ, 14బీ బ్లాకుల్లో స్థానికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను వెంకటేశ్వర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాపిరెడ్డి నగర్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల్లో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇతర సీనియర్ నాయకులతో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు హాజరైన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాగణపతి స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణారెడ్డి, గడ్డం రాజేశ్వరరెడ్డి, ఏసిరెడ్డి భూపాల్‌రెడ్డి, మాయ రాజయ్య, సింగిరెడ్డి భూపాల్‌రెడ్డి, దొడ్ల రామిరెడ్డి, ఈరెడ్డి దేవేందర్‌రెడ్డి, రమేష్ యాదవ్, చిట్టిరెడ్డి గోపాల్‌రెడ్డి, వావిళ్ల బగ్గయ్య, మాయ బాలనర్సయ్య, డాకురి అక్కిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కర్ల తిరుపతిరెడ్డి, వంగర శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్ యాదవ్, పాండుగౌడ్, చంద్రయ్య, రాజ నరసింహరెడ్డి, గోపాల్, దొడ్ల సాయిరెడ్డి, కృష్ణ, వెంకట్‌రెడ్డి, సాయి, బీవీకే శ్రీకాంత్, సంతోష్ గుప్తా, రాజిరెడ్డి, రాజేందర్, మల్లేష్ మేస్త్రీ, ఉపేందర్, మహేందర్‌రెడ్డి, నాగార్జున, మల్లారెడ్డి, చిన్న, వెంకట్‌రెడ్డి, అనిల్, రంగారెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, సుశీల్, ప్రతాప్‌రెడ్డి, రమణచారి, వెంకట్‌రెడ్డి, సునీల్, దామోదర్‌రెడ్డి, జితేందర్, హనుమంతు యాదవ్, జగన్‌రెడ్డి, రాజు, రవి తదితర నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.