మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశేషులు పాపకంటి శేఖర్ 11వ వర్ధంతి
ప్రజా కళాకారుడు, తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ పాప కంటి శేఖర్
షాద్ నగర్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా కళాకారుడు తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా షాద్ నగర్ తాలూకా జేఏసీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం,ఆయన ఉద్యమ సేవలను స్మరించుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించిన పాపకంటి శేఖర్ త్యాగస్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత యువతకు మార్గదర్శకమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి తెలంగాణవాసి బాధ్యత అని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాప కంటి శేఖర్ కు జోహార్లు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో తాలూకా చైర్మన్ ఏం జనార్ధన్,వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ కరుణాకర్, తాలూకా కన్వీనర్ గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, హెల్త్ సూపర్వైజర్ జక్కుల శ్రీనివాస్, కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ నాయక్, సిఐటియు రాజు నాయక్, పాప కంటి శేఖర్ తమ్ముడు. పాపగంటి కృష్ణ, మాణిక్యం సీతారాం, భీష్వ కృష్ణయ్య, మందారం నర్సింలు, ఏఐఎస్ఎఫ్ పవన్, రవీంద్రనాథ్, ఆర్టీసీ అర్జున్ కుమార్, కేశంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేశం, గాయకుడు శివ,
చౌదరి గూడెం మండలం ఎలుకగూడెం సర్పంచ్ చాకలి బందయ్య,పద్మారం మాజీ సర్పంచ్ చెన్ని గారి నర్సింలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నవరం వెంకట్ నర్సింహారెడ్డి, పద్మారం వెంకటేష్ యాదవ్,ఎస్సీ సెల్ కన్వీనర్ అశోక్, భీమయ్య, వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నవీన్, కృష్ణకుమార్ లు ఘనంగా నివాళులర్పించడం జరిగింది..