మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి అమలులోకి తేవాలి
పయనించే సూర్యుడు జనవరి 6 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
కన్నంబాకం హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ( MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే.
కాంగ్రెస్ పార్టీ 2006 లో గ్రామీణ ఉపాధికి హామీ పథకం శ్రీకారం చుట్టింది ఏపీలోనే . దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం సాధించింది. పనికి ఆహార పథకం అమలులో అప్పుడు కాంగ్రెస్ పాలన దేశానికే ఆదర్శం. కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్.
ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం.2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే,ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నరేగా చట్టం పుణ్యమే.ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన దేశ పేదలకు ప్రధాని మోడీ గారు పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు.చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు.మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే.కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం.
ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టం.రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి,గ్రామస్వరాజ్యం వినాశనమే ధ్యేయంగా మోడీ గారు చేస్తున్నది నీచపు పాలన.నరేగా చట్టంలో 100 రోజుల ఉపాధి ఒక హక్కు ఏ గ్రామంలోనైనా,ఏ సీజన్ లోనైనా పని కోరే హక్కు ప్రజలది.పనుల తీరు నిర్ణయాధికారం గ్రామసభలది.100 రోజుల పనికి ఇచ్చే వేతనాలు పూర్తిగా కేంద్రానివే.వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులు గ్రామసభ కాకుండా డిల్లీ సభ నిర్ణయిస్తుందట.ఇదెక్కడి న్యాయం..ఇదేం చట్టం ? అన్ని గ్రామాల్లో కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని కల్పిస్తారా? ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెడతారా ? ఏడాదికి 60 రోజులు పని బంద్ పెట్టడం ఇదేం నియంత చట్టం ? 40 శాతం రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోతే ఉపాధి ఎలా దక్కుతుంది ? కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా పనులు పరిమితం చేయడమంటే ప్రజలను పరిమితం చేస్తున్నట్లు కాదా ? గ్రామ ఆస్తుల్లో కాకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం అంటే కార్పొరేట్ వ్యవస్థలను పోషిస్తున్నట్లు అవ్వదా ?మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్.AICC పిలుపు మేరకు,APCC ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నాం.
కలిసి వచ్చే పార్టీలు,ప్రజాసంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
