మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం బిజెపి కుట్రలో భాగం
పయనించే సూర్యుడు డిసెంబర్ 19( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
భారతదేశంలో వ్యవసాయ కూలీలకు సంవత్సరం రోజుల్లో కనీసం వంద రోజులు ఉపాధి పని కల్పించాలని నాటి యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం(MGNREGA)పేరుతో పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రధాన లబ్ధిదారు వ్యవసాయ కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ సూళ్లూరుపేట విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు అని అన్నారు మహాత్మా గాంధీ పేరును తొలగించడం బిజెపి కుట్రలో భాగమే దేశంలో శ్రమజీవులు పేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన(MGNREGA) పేరును రద్దు చేస్తూ పార్లమెంటులో బిల్లు తీసుకోవడం ద్వారా మహాత్మా గాంధీ పేరు స్థానంలో వేరే పేరు పెట్టి మహాత్మా గాంధీని అవమానించడం కాకుండా ఈ కొత్త పథకం వచ్చాక కేంద్రం ద్వారా వచ్చే నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడేలా ఈ కొత్త పథకం ఉంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును తొలగించడం ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకం అన్నారు ఈ పేరు మార్పు నిర్ణయాన్ని కేంద్రంలో అధికారంలో ఉండే బిజెపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
