మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టువ్యాధి నివారణ ప్రతిజ్ఞ
పయనించే సూర్యుడు,జనవరి 30, అశ్వాపురం:
అశ్వాపురం గ్రామపంచాయతీ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో కుష్టువ్యాధి నివారణ భాగంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు డాక్టర్ సంకీర్తన ఆధ్వర్యంలో కుష్ఠు వ్యాధి అవగాహన ప్రచారంలో చేయాల్సిన ప్రతిజ్ఞ నా కుటుంబములో లేదా పొరుగు వారిలో లేదా ఈ సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా దానిమీద నొప్పి కలిగించి నప్పుడు తెలియకపోతే వారిని సమీప ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకోని తగిన చికిత్స తీసుకోమని సలహా ఇస్తాను. కుష్ఠువ్యాధి గ్రస్తులను మరియు కుష్ఠు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారిపట్ల శ్రద్ద వహిస్తాను, వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చికిత్స తీసుకొనేలా నేను భాధ్యత వహిస్తాను.కుష్ఠు వ్యాధి గ్రస్తులను నా స్వంత కుటుంబ సభ్యులుగా భావించి ఎటువంటి వివక్షత చూపకుండా ప్రేమతో వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేలా పాటుపడుతాను. కుష్ఠువ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అని, ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి పూర్తిగా నయమవుతుందని, సత్వర చికిత్స ద్వారా కుష్టువ్యాధి మూలంగా వచ్చే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చనే సందేశాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టువ్యాధి రహిత భారతదేశ నిర్మాణములో అందరితో కలిసి కృషి చేస్తానని, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని గ్రామపంచాయతీ లో నిర్వహించిన ఈ కుష్టువ్యాధి నివారణ కార్యక్రమం లో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దాసరి మల్లేశం, పీ.హెచ్.ఎన్ పుష్ప లత, హెచ్.వి శ్యామ లత, ఎ.ఎన్.ఎంలు ఆశలు, గ్రామ ప్రజలు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.