మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
పయనించే సూర్యుడు నవంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బి. శ్రీరామ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు నందు గల మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్ . బీఎస్పీ రాష్ట్ర మహిళ కన్వీనర్ క్రాకుటూరు పుష్పాంజలి . పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగినది.అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడెంపాటి అశోక్ . జిల్లా అడ్వైజర్ టీ. కృష్ణ . రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు ఇండ్ల శివయ్య .రూరల్ నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి పెంచల ప్రసాద్. రూరల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి బద్రి. కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు కడింపాటి అనిల్. మరియు బీఎస్పీ నాయకులు . చిరమణ సుధాకర్ ఇనమాల చెంగళరావు . కీర్మని అబ్దుల్ ఎల్లు శ్రీనివాసులు . తదితరులు పాల్గొన్నారు.