మహా వీర్ సావర్కర్ వర్ధంతి
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం వీర సావర్కర్ చౌరస్తా లో వీర దామోదర్ సావర్కర్ వర్ధంతి
:పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి27 మక్తల్ :
స్థానిక మక్తల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర సావర్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ భీమేష్, మాట్లాడుతూ వీర సావర్కర్ 1966 ఫిబ్రవరి 26న బొంబాయిలో మరణించారు. ఆయన ఫిబ్రవరి 26 1883 నుండి ఆహారం, నీరు, మందులు మానేసి, ‘ఆత్మసమర్పణ’ (ఉపవాస దీక్ష) ద్వారా మరణాన్ని ఆహ్వానించారు,26 ఫిబ్రవరి 1966 మరణించిన ప్రదేశం బొంబాయి , మహారాష్ట్ర.ఆయన హిందూత్వ భావజాలాన్ని అభివృద్ధి చేసిన ప్రముఖ భారత గొప్ప రచయితకవి, రాజకీయ నాయకుడు, మరియు స్వాతంత్ర్య సమరయోధుడు,వీర్ సావర్కర్ తన జీవిత చివరి రోజుల్లో “ఆత్మసమర్పణ” (జీవితం సమాజానికి ఉపయోగపడనప్పుడు దాన్ని త్యాగం చేయడం) నిర్ణయించుకున్నారు. అని తెలపడం జరిగింది
అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎనోమెంట్ EO కి వినతి పత్రం అందజేశారు జాతీయ రహదారి పక్కన గల సర్వే నంబర్ 35 శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ స్థలములో ఎటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయొద్దని తెలపడం ఒకవేళ పబ్లిక్ టాయిలెట్స్,బాత్రూమ్స్, నిర్మాణము చేయాలనుకుంటే ప్రతి సంవత్సరము జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా రామ్ లీలా మైదానంలో దేవాలయ స్థలంలో చివరి భాగాన నిర్మాణము చేయాలని అక్కడ నిర్మాణం చేస్తే ఎవరికీ ఎలాంటి అభిప్రాయ బేధం ఉండదని తెలపడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి మల్లికార్జునరావు,బజరంగ్ దళ్ సంయోజక్ రాహుల్, సాహ సంయోజక్ శివ, సాహ సంజక్ మూర్తి, శ్రీను,అక్షయ్, నాగరాజు, భరత్,శివ,మహేష్ సగర్, రామకృష్ణ,రమేష్, అనిల్,తదితరులు పాల్గొన్నారు.