మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తి”
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు
–నివాళులర్పించిన జనసేన నాయకుడు భవనాశి వాసు
నంద్యాల జిల్లా, దేశంలో స్త్రీ విద్యకు, మహిళా హక్కుల కోసం పోరాడిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని జనసేన పార్టీ నంద్యాల జిల్లా నాయకుడు భవనాశి వాసు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం భవనాసి వాసు కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా భవనాశి వాసు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,సమాజంలోని దురాచారాలను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు ఆమె అని గుర్తుచేశారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగి వెంకటేశ్వర్లు, బుక్కాపురం గ్రామానికి చెందిన జనసేన నాయకులు కుంచపు వరప్రసాద్ కుంచపు శ్రీనివాసులు
మిద్దె శివ పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు. అనంతరం 200మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.