మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే
(పయనించే సూర్యుడు జనవరి 3 రాజేష్ దౌల్తాబాద్)
రాయపోల్ కేంద్రంలో అంబేద్కర్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.