PS Telugu News
Epaper

మహిళ సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

📅 19 Jan 2026 ⏱️ 4:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.

భైంసా లో మెప్మా సంఘాలకు 92లక్షల 62 వేల 329 రూపాయల రుణాలను అందజేసిన ఎమ్మెల్యే మహిళ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.సోమవారం భైంసా మున్సిపల్ కార్యాలయం లో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 92, 62,329 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన సందర్భంగా మాట్లాడారు.బ్యాంక్ అప్పుల ను చెల్లెస్తూ అధికంగా రుణాలను తీసుకుంటు ఆర్థిక అభివృద్ధి సాధించాలని చెప్పారు. సంఘాల సభ్యులు రుణాలను చెల్లిస్తూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.. అనంతరం సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలన్నా ఉద్దేశ్యం తో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు.. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Scroll to Top