PS Telugu News
Epaper

మాగనూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి సహకరించాలి

📅 07 Apr 2026 ⏱️ 8:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రజా పాలనలో అందరు సమానమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్8మాగనూర్ }

మాగనూర్ మండలంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సవ్యంగా సాగుతుందని నిజమైన నిరుపేదలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్క గ్రామాల సర్పంచులు ఆయా పార్టీల నాయకులు సంపూర్ణంగా సహకరించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గతంలో పది సంవత్సరాలపాటు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్ని ఎళ్లు మంజూరు చేసింది ఎన్నో ఇల్లు కట్టించిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. నిన్న అమ్మపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి అధికారులు ఫోటో కాల్ పాటించలేదని గ్రామ సర్పంచ్ అనడం సవ్యం కాదని అన్నారు. అమ్మపల్లి నిజమైన లబ్ధిదారుల సంవత్సరంలోపు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నిన్న మంచి రోజు ఉన్నందుకు వాళ్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిరాలు శ్రీ మతి గోవిందమ్మ.పిలుపుమేరకు గృహప్రవేశానికి హాజరు కావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి మేము కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మాత్రమే చూస్తున్నామని నిజమైన పేదలకు లబ్ధి జరుగుతే అదే చాలని అన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లు ఉన్న గ్రామాలకు కూడా సమానంగా ఇందిరమ్మ ఇల్లు మహిళలకు మంజూరు చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు మంత్రి గారి ఆదేశానుసారంతో అభివృద్ధి పనులు మట్టి రోడ్లు, స్కూల్ లకు కాంపౌండ్స్ వాల్స్ , షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, అంగన్వాడీ బిల్డింగ్స్, వివిధ గ్రామాలకు గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ టాయిలెట్స్, ప్రతి ఊరికి మినీ చౌక ధర దుకణాలు, మాగనూర్ నుండి అచ్చంపేట బీటి రోడ్డు చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచుల చేతుల మీదుగానే భూమి పూజ కాని ప్రారంభాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని తీసుకువెళుతున్నాం కావున వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్ నాయకులు గ్రహించాల్సిందిగా మిమ్మల్ని అందరిని ప్రత్యేకంగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను..

Scroll to Top