PS Telugu News
Epaper

మాగ్నెట్ స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

📅 09 Jan 2026 ⏱️ 5:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్న విద్యార్థులు

సంక్రాంతి యొక్క విశిష్టతను వివరించిన కరస్పాండెంట్ వాజిద్ పాషా

( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం కేంద్రంలోని మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ముందస్తు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ను ఘనంగా జరుపుకున్నారు.సంక్రాంతికి సంబంధించిన ముగ్గుల పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ముగ్గుల పోటీలలో పాల్గొని వివిధ రకాలైన ముగ్గులను వేయడం జరిగింది. దానితోపాటు పతంగులను కూడా ఎగరవేయడం జరిగింది. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ వాజిత్ పాషా మాట్లాడుతూ… సంక్రాంతి యొక్క ముఖ్య ప్రాముఖ్యతను వివరిస్తూ సంక్రాంతి వివిధ రకాలైన ముగ్గుల పోటీలు దానితోపాటు పతంగులను ఎగరవేయడం సంప్రదాయంగా వస్తుందని పేర్కొన్నారు. ఇందులో వివిధ విద్యార్థులు ముగ్గులను వేసి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరికులం డైరెక్టర్ వినోద్ కుమార్ ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఇతర బృందం పాల్గొనడం జరిగింది.

Scroll to Top