మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన భామ్ని తండా సర్పంచ్ రోహిదాస్ .
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భామిని తండా గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోబడిన రోహిదాస్ గారు మరియు వార్డు సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ జి విట్టల్ రెడ్డి ని కలవడం జరిగింది విఠల్ రెడ్డి గారు మాట్లాడుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, నాయక్ ఆర్ పుండలిక్ ,కారోబరి అప్పారావు,డావు జాదవ్ మాన్సింగ్,ఉపసర్పంచ్ జాదవ్ అమర్ సింగ్, గ్రామ పెద్దలు మరియు తండావాసులు ఉన్నారు.
