కాంగ్రెస్ నాయకులు జటావత్ రవీందర్ నాయక్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కేశంపేట మండల పరిధిలోని పాటిగడ్డ గ్రామానికి ఉన్న మొట్టమొదట సమస్య వాగు వర్షాకాలం రావడంతో రాకపోకలు ఇబ్బంది గా ఉండేది. వ్యవసాయ పొలాలకు పోవటానికి వీలు లేని పరిస్థితి ఉండేది. దీనికి పరిష్కారం చూపిన షాద్నగర్ శాసనసభ్యులు విరపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు గ్రామానికి ఉన్న వాగు సమస్యను దృష్టిలో పెట్టుకొని మళ్లీ నేను పాటిగడ్డ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం నిధులతో మళ్లీ గ్రామంలో అడుగు పెడతానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహానుభావుడు వీర్లపల్లి శంకర్ అని కాంగ్రెస్ నాయకులు జటావత్ రవీందర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటిగడ్డ గ్రామ ప్రజలు పాల్గొనీ సంతోషం వ్యక్తం చేశారు.

