PS Telugu News
Epaper

మాధవరెడ్డి సేవలు మరువలేనివి : చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ .

📅 07 Mar 2026 ⏱️ 4:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ మార్చి 08.

దివంగత మాజీమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని చౌటుప్పల్ పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ గారు అన్నారు.,దివంగత నేత, మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి (మార్చి 7) సందర్భంగా నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల మనిషిగా, అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన 2000లో ఇదే రోజున మందుపాతర ఘటనలో మరణించారు.
మాధవరెడ్డి వర్ధంతిని సందర్భంగా చౌటుప్పల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చౌటుప్పల్ పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ గారు మాట్లాడారు., ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి మాధవరెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య, సామిడి రాఘవరెడ్డి గారు, కొసనం రాకేష్ రెడ్డి, ఊడుగు జ్యోతి, పిల్లలమరి మధుసూదన్, ఎండి హను బాయ్, వెలుగ రాజశేఖర్ రెడ్డి, చిన్నగోని అంజయ్య గౌడ్,చామకూర రాజయ్య, బొంగు శీను గౌడ్, సుర్కంటి బాలకృష్ణారెడ్డి, వెంకటేష్, సురేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు, మాధవరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.,

Scroll to Top