మీబిడ్డగా నన్ను ఆశీర్వదించండి అభివృద్ధిచేసి చూపిస్తా
పయనించే సూర్యుడు డిసెంబర్ 15 మక్తల్
మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సకిరమోలా నరసింహ మాట్లాడుతూ మీ బిడ్డగా సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మాధ్వర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని మాధ్వార్ లో వార్డు అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్ధంగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని ప్రతి ఒక్కరు ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి వాడలో డ్రైనేజీ సిసి రోడ్లు వేయడంతోపాటు విద్య రంగాలకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచానని అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ తనకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వరరావు, వడ్ల సత్యనారాయణ.గాండ్ల రాములు. కమ్మరి బ్రహ్మయ్య. బొంబాయి శంకర్. అరికెరి సవరప్ప. కురువ వెంకటరమణ. గణపురం వెంకటప్ప. బుడబోయి శాంతప్ప. బాట విశ్వనాథ్.ప్యాట నాగమ్మ. గ్రామ కాంగ్రెస్ నాయకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
