ముందుగా నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ.”
పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యల వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గొళ్ళ రాజేష్ పేద,మథ్య తరగతి ప్రజలకు, కౌలు రైతులకు, దీర్ఘకాలిక వ్యాధితో బాథ పడుతున్న వారికి నిరుద్యోగవిద్యర్థి,విద్యార్థిని యువతకు, ఒక్క రూపాయికే రెండు పుల్కా పప్పు,కర్రీ, ఒక్క వెజిటేబుల్ పలావ్,కర్రీ (రూపాయికే కలర్ రైస్) ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయ సహకారాలతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వారందరికి అండగా నిలుస్తూ పేదవారికి పెద్దన్నగా,నిరుపేదలందరికీ అండగా నిలుస్తూ ఎన్నో సేవ,సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోళ్ళ రాజేష్,అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని సమాజంలో తప్పుగా దొంగలుగా చూపించే ప్రయత్నం కొంతమంది ప్రబుథ్థులు చేశారు. కాబట్టి అలా ఒక చిన్న అంతరాయం కలగడం వల్ల ఈనెల మూడో తేదీన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు దాదాపు 200 మందికి ఇవ్వవలసిన నాలుగు లక్షల రూపాయల చెక్కులను మాత్రమే నిలుపుదల చేయవలసి వచ్చింది. మిగిలిన సేవా కార్యక్రమాలన్నీ కూడా యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎవరైనా సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయి అని ప్రజలు ఎవరు కూడా భావించవలసిన అవసరంలేదని తెలియజేసుకుంటున్నాము.దీర్ఘ కాలిక వ్యాధిగాస్తుల కు ఇవ్వవలసిన నాలుగు లక్షల రూపాయల చెక్కులను కూడా ఈ నెలలోనే పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందివ్వబోతున్నాం. నిరుద్యోగ వికాస భృతి ద్వారా విద్యార్థినీ,విద్యార్థులకు 2000 రూపాయలు ఈ నెలలోనే ఆర్థిక సహాయం కూడా యధావిధిగా కొనసాగుతుందని తెలియజేసుకుంటునాము. ఇట్లు..
మీ గోళ్ళ రాజేష్.