PS Telugu News
Epaper

ముఖ్యమంత్రికి ఆహ్వానం:తెలుగు మహా సభలకు రండి

📅 20 Feb 2026 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి

చంద్రబాబు ను ఆహ్వానించిన కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు

అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 1న జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు కోరారు.అమలాపురం కిమ్స్ (KIMS) వైద్య కళాశాల ప్రాంగణంలో భారీగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు చైతన్ రాజు ముఖ్యమంత్రికి వివరించారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన మహాసభల ఆహ్వాన పత్రికను అందజేసారు ​ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, వేగుళ్ళ జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు లు ఉన్నారు. అమలాపురం వేదికగా జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.​రెండు రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులు, భాషాభిమానులు హాజరుకానున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చైతన్య రాజు తెలిపారు.

Scroll to Top