PS Telugu News
Epaper

ముఖ్యమంత్రి ఇంద్రధనస్సు పథకాలు దివ్యాంగుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: మంత్రి ఫరూక్.

📅 06 Dec 2025 ⏱️ 3:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

మంత్రి ఫరూక్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.మంత్రి ఫరూక్ ను సంఘం ప్రతినిధులు శాలువాతో సత్కరించి కూటమి ప్రభుత్వ దివ్యాంగుల పథకాలకు హర్షం ప్రకటించారు. సంఘం ప్రతినిధులకు మంత్రి ఫరూక్ కు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన దివ్యాంగుల ఇంద్రధనస్సు పథకాలు రాష్ట్రంలో దివ్యాంగుల అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం,సబ్సిడీ రుణాలు పునరుద్ధరించడం,ప్రత్యేక కళాశాలలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించడం, దివ్యాంగ భవనాలు ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో దివ్యాంగులకు నామినేటెడ్ విధానంలో ప్రాతినిధ్యం కల్పించడం దివ్యాంగుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ దివ్యాంగులకు మూడువేల నుండి ఆరు వేలకుకు పెంచిన విషయం గుర్తు చేశారు. టిడ్కో గృహాలలో గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగులకు ఇల్లు కేటాయిస్తామని,దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా ఏర్పడినప్పటికీ, దివ్యాంగుల శాఖ కార్యాలయం కర్నూలు ఉమ్మడి జిల్లాకు కలిపి ఒకటే కర్నూలులో ఉన్నదని, నంద్యాలలో జిల్లా దివ్యాంగుల శాఖ కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య లతోపాటు సంఘం ప్రతినిధులు హనీ ఖాన్, కరీముల్లా, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top