ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక వరం.వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీలో కూరపాటి శంకర్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.30/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఒక వరమని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి అన్నారు.గురువారం మండల పరిధిలోని రాజగోపాలపురం పంచాయతీ బాలగోపాలపురంలో పలువురు వరద బాధిత ఎస్టిలకు నిత్యాసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథులుగా జడ్పిటిసి విజయలక్ష్మి,సురుటుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు,పిచ్చాటూరు సతీష్ నాయుడు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ వంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి,ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా ముందుచూపుతో వ్యవహరించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.తాను స్థానికంగా ఇక్కడే పుట్టడం వల్ల ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే ఇక్కడ ఉన్న స్థానిక నేతలు తాగునీరు,రోడ్లు, అంగన్వాడి కేంద్రాలు,గృహాలు,ఇంటి స్థలాలు వంటి సమస్యలపై తగిన ప్రతిపాదనలు ఇచ్చినట్లయితే నెల రోజుల్లోపు తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఇప్పటికే నాగలాపురం టు చిన్నపాండూరు తారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు.తదనంతరం కూరపాటి శంకర్ రెడ్డి,జడ్పిటిసి విజయలక్ష్మి తదితర టిడిపి నాయకులతో కలిసి పలువురు వరద బాధితులకు ఒక బస్తా బియ్యం,కూరగాయలు,వెయ్యి రూపాయలు నగదు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచులు రవి రెడ్డి,గోవిందస్వామి, రూబెన్,టిడిపి నాయకులు శివకుమార్ నాయుడు బాలరాజు,దామురాజు,మురళి( చికెన్ చిన్న),లాంకో వాసు,ధనశేఖర్,జడేరుబాబు,మునివేలు, మాస్టర్ స్కూలు శ్రీనివాసులు రెడ్డి,రాధాకృష్ణ,వినాయకం, శివయ్య,జనసేన నాయకులు రూపేష్ కుమార్,బాల మురళీకృష్ణ,రేషన్ డీలర్స్ సంఘం అధ్యక్షులు సునీల్ జైన్,పలువురు వరద బాధితులు తదితరులు పాల్గొన్నారు.