ముఖ ద్వారాలు గ్రామాల గౌరవాన్ని పెంచుతాయి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామం నూతన ముఖద్వారాన్ని ప్రారంభించిన అంజయ్య యాదవ్
తన తండ్రి జ్ఞాపకార్థం ముఖ ద్వారం ఏర్పాటుచేసిన చీపిరి రమేష్ యాదవ్
గ్రామాలకు, పట్టణాలకు ఉండే ప్రధాన ముఖద్వారాలు ఆ గ్రామం, పట్టణం యొక్క గౌరవాన్ని పెంచడంతోపాటు సంస్కృతిని చాటుతాయని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చీపిరి రమేష్ యాదవ్, వారి సోదరులు తన తండ్రి అంజయ్య జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటుచేసిన ముఖ ద్వారాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ముఖ ద్వారాలు ఆ గ్రామం, పట్టణం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభంభిస్తాయని, అదేవిధంగా భద్రతా ప్రామాణికాలకు అండగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ కలిగించే విధంగా స్వాగతతోరణం ఏర్పాటు చేయడం హార్షదాయకమని ఈ సందర్భంగా చీపిరి రమేష్ యాదవ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగయ్య గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ చైర్మన్ నరేందర్, పట్టణ అధ్యక్షులు నటరాజ్, మాజీ సర్పంచ్ అశోక్, నాయకులు వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రవి యాదవ్, చిన్న యాదగిరి నరేందర్, పొచమోని నందు యాదవ్, చందు నాయక్, నర్సింలు యాదవ్, సింగపగా వెంకటేష్, సింగపాక కుమార్, సింగపాక యాదయ్య, పాత్లావత్ సోమ్లా నాయక్, మోహన్ నాయక్, రాము యాదవ్, మహేష్ యాదవ్, పవన్ యాదవ్, పి.జంగయ్య, శేఖర్ యాదవ్, కృష్ణయ్య, రాములు, అంజయ్య, యాదయ్య యాదవ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, హారిష్ రెడ్డి, పి.యాదగిరి,కుమారి శ్రీను, గ్రామస్థులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
