ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన
పయనించే సూర్యుడు నవంబర్ 28 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “ముగ్గులు పోటీల ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనను నాయుడుపేట సూళ్లూరుపేట, వెంకటగిరి మరియు దొరవారిసత్రం లోని ఏరియాలలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమము లో భాగంగా ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి మాట్లాడుతూ ఈ ముగ్గులు పోటీల ద్వారా ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, ఎ.ఆర్.టి మందులు గూర్చి తెలియజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ సి.సి పి.యు సిబ్బంది అయిన కవిత, మంజుల, నందిని, శ్రావణి, సాయి లక్ష్మి, ఐశ్వర్య, ముని కూమారి, శ్రీలత, పి.ఇ లు మరియు ఇతర మహిళలు పాల్గొని ముగ్గులు ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ పై వీరిలో గెలిచిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ను ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అందజేస్తామని తెలిపారు.
