PS Telugu News
Epaper

ముధోల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భూమి పూజ…

📅 06 Feb 2026 ⏱️ 5:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

ముధోల్ మండలంలోని బ్రహ్మన్ గావ్ గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, అలాగే మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.అదేవిధంగా, గన్నోర గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, ఎడ్ బిడ్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమాలను *ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ * ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రహరీ గోడ నిర్మాణంతో వారికి పూర్తి రక్షణ కలుగుతుందని తెలిపారు. అలాగే, మహిళా సమైక్య సంఘ భవనాల ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా రంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top