ముధోల్ లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 23 జోనల్ పోటీలు ప్రారంభం.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
ముధోల్ మండల కేంద్రంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగింది, మొదటి మ్యాచ్ అదిలాబాద్ మరియు మంచిర్యాల టీంలు పోటీపడ్డాయి, ఈ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున ఎండల లక్ష్మీనారాయణ , ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ , తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు పటేల్ , ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్ , ఉప సర్పంచ లావణ్య సాయి , క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మల దత్తు , బిజెపి మండల అధ్యక్షులు పోతన్న , మాజీ ఎంపీటీసీ మగ్దుమ్ , మేరోజ్ ఖాన్ గారు, టిసిఏ అభయ్ పటేల్ , రోల్ల రమేశ్ ,మదన్ మోరే , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు మాట్లాడుతూ ఈ పోటీలు మూడు రోజులు జరుగుతాయని, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని రాష్ట్రస్థాయిలో ప్రోత్సహిస్తామని తెలపడం జరిగింది.