PS Telugu News
Epaper

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మతిభ్రమించిన బిజెపి,టిఆర్ఎస్ నాయకులు

📅 23 Feb 2026 ⏱️ 4:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

కాంగ్రెస్ పార్టీపై అబదప్పు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు* *రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి* హెచ్చరికఈరోజు సోమవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర వైరాగ్యంలోకి వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా బదనాం చేస్తూ మున్సిపల్ ఫలితాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రాబోయే రెండు సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బిజెపి నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, మునిసిపల్ ఎన్నికల కంటే ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ పట్టణ ఫలితాలు పూర్తిగా బిజెపి వైపే ఉన్నాయని బింకాలు పలికి చివరికి ఒకటి రెండు స్థానాలకే పరిమితం అవడం జరిగిందని, మతసామరస్యానికి చిహ్నంగా ఉన్న కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో చిచ్చు రేపే ప్రయత్నానికి బిజెపి తెరలేపింది అని, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నుండి ప్రజలను పక్కదోవ పట్టించడానికి పశ్చిమ బెంగాల్ తరహా అల్లర్లను కామారెడ్డిలో సృష్టించే ప్రయత్నం బిజెపి పార్టీ చేస్తుంది అని, ఇది గత మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటేనే అర్థం అవుతుంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా పది సంవత్సరాలు గడిచిన బిజెపి నాయకులు ఎన్ని కుళ్లు కుతంత్రాలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడమనేది వారి కలగానే మిగిలిపోతుంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. మీ అంతర్గత మిత్రులు కేసీఆర్, కేటీఆర్ లతో కలిసి వచ్చిన తెలంగాణలో అధికారంలోకి రారు అని, కామరెడ్డి లో బిజెపి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పై సవాల్ విసిరితే దానిని స్వీకరించి ఆధారాలతో వస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన సందర్భంలో అక్కడ శాంతిభద్రతలను కాపాడాలని ఉద్దేశంతో పోలీసులు ఇరువర్గాల నాయకులను అదుపులో ఉంచడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి అటువైపుగా వెళుతుంటే బిజెపి మూకలు మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికల్లో తీవ్రంగా విఫలమయ్యామనే ఆలోచనతో కాంగ్రెస్ నాయకుడిపై, అతని వాహనంపై చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. పశ్చిమబెంగాల్ తరహాలో తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని చేస్తున్న ఆలోచనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ ఇకనైనా మానుకోవాలని ప్రజలకు వాస్తవాలు వివరించి ముందుకు వెళ్లాలని మానాల మోహన్ రెడ్డి సూచించారు. కామరెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు మాట్లాడే పద్ధతి సరైనదిగా ఉండాలని చెప్పిన వ్యక్తి అదుపుతప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన షబ్బీర్ అలీ పై ఆన్ పార్లమెంటరీ పదాలు వాడుతూ దూషించడం సరైనది కాదు అని, కామారెడ్డి ఎమ్మెల్యే చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా ఉంది అని, భవిష్యత్తులో ఆయన తన తీరును మార్చుకోవాలని మానాల మోహన్ రెడ్డి సూచించారు.*మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మతిభ్రమించిన ప్రశాంత్ రెడ్డి* బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మానసిక స్థితిని కోల్పోయాడని, రైతుల సమస్యలపై పోరాడితే రైతులపై కేసులు పెడతారా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ నిన్న ప్రశాంత్ రెడ్డి ర్యాలీ ధర్నా చేయడం జరిగిందని, ప్రశాంత్ రెడ్డి ఒక్కసారి గతంలో తన 9 సంవత్సరాల పాలనలో ఎవరు ఏ ప్రభుత్వం రైతులపై కక్షపూరిత చర్యలకు పాల్పడిందో మీకే అర్థమవుతుంది అని, బాల్కొండ నియోజకవర్గంలో లీకేజీ వాటర్ కొరకు ఉద్యమం చేసిన మహిళలపై కేసులు పెట్టిన నీచమైన చరిత్ర మీ టిఆర్ఎస్ పార్టీది అని, భీంగల్ లో తులం బంగారం గురించి అడిగితే టిఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టారని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడని ఒక్కసారి ఆరోజు ఏం జరిగిందో ప్రశాంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలని ఒక మంత్రిని అడిగే పద్ధతి అదేనా అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బాల్కొండ గ్రామంలో ఇఫ్తార్ విందుకు వస్తున్న సందర్భంలో మైనారిటీ సోదరుడు కారు ముందుకు వచ్చి మా ఏరియాలో సిసి రోడ్లు లేవని అడిగిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ అయినందున కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఉంచిన చరిత్ర నీది అని, రైతు సమస్యలపై పోరాటం చేసిన నిజమైన రైతులను జైల్లో పెట్టించింది నువ్వు అని, పసుపు ఎర్ర జొన్న రైతులైన అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయి రెడ్డి , మంతిని శ్రీనివాస్ రెడ్డి,సిపిఐ ఎంఎల్ ప్రభాకర్, చాలామంది రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన చరిత్ర నీది కాదా అని ప్రశాంత్ రెడ్డి ఆలోచించుకోవాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది అని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని రెండు ఓటములకే ప్రశాంత్ రెడ్డి మానసికంగా ఇంత ఇబ్బందులు పడితే భవిష్యత్తులో ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేది ఉంది అని ఒక ఓటమితోనే కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నీ తీరు క్షమించరానిదని మానాల మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ తమకు జరిగిన అవమానకర ఓటమిని కప్పిపుచ్చుకోని ప్రజల్లోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని వాస్తవాలు చూసి మాట్లాడాలని, మత కల్లోహాలు సృష్టించాలని బీజేపీ పార్టీ, అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనే ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీ చూస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు వైశాక్షి సంతోష్ ,బ్లాక్ కాంగ్రెస్ జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సకినాల శివప్రసాద్ ,సాయికిరణ్ ,కౌశిక్ శివ మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top