PS Telugu News
Epaper

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల రాము సంఘీభావం

📅 27 Dec 2025 ⏱️ 2:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో GO ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సంఘీభావం తెలపడం జరిగింది

భైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న అంతు లేని అవినీతి…… మున్సిపల్ కార్యాలయం అన్ని విభాగలలో అవినీతి జరుగుతుంది అని గత మూడు నెలల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత వారం రోజుల క్రితం మున్సిపాలిటీ కి సంబందించిన ఇంచార్జ్ శానిటేరీ ఇన్స్పెక్టర్ అనిస్ ను విధుల నుండి తొలగించడం జరిగింది. అనిస్ పై అవినీతి ఆరోపణలే కాకుండా… శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా ఎటువంటి జాయినింగ్ అడ్డర్ కాపీ లేకుండా విధులు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా బాధ్యతలు నిర్వహించిన నుండి ఎప్పటి వరకు చాలా సార్లు అవినీతి కి పలుపడటం జరిగింది. గత రెండు నెలల క్రితం మున్సిపల్ కార్మికుల కు మీ యొక్క జీతాలు పెంచుతామణి వారి నుండి డబ్బులు వసూలు చేయడం అందులో అనిస్ తో పాటు మరికొందరి ప్రమేయం ఉంది వారి అందరి పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ కౌన్సిలర్ ల తరపున కలెక్టర్ మరియు sub కలెక్టర్ కు కోరటం జరుగుతుంది.మున్సిపాలిటీలో హెల్త్ వర్కర్స్ పేరు తో 19మంది ఎటువంటి జాయినింగ్ అడ్డర్ లేకుండా ప్రధాన పోస్ట్లు విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 19మందినీ కూడా మీకు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారు. వారు గత 16నెలలు గా ఎటువంటి జీతాలు లేకుండా మున్సిపాలిటీలో పలు విభాగంలో పనులు చేస్తున్నారు. ఈ 19మంది మున్సిపల్ కు సంబంధం లేని వ్యక్తులు అలాంటప్పుడు వీరు మున్సిపాలిటీలో విధులు ఎలా నిర్వహించడం జరుగుతుంది. కావున వీరి పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు కోరటం జరుగుతుంది.అనిస్ పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో చెత్త కొరకు ఉపయోగించే ఆటోలు మరియు టాక్టర్స్ లో పెట్రోల్, డిజిల్, బిల్లులలో సుమారు 50లక్షలు అవినీతి జరిగింది కావున దీని పై కూడా విచారణ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ కౌన్సిలర్ ల తరపున కోరటం జరుగుతుంది.

Scroll to Top