PS Telugu News
Epaper

మున్సిపల్ జవాన్ గుర్రపు రాజన్న ఆకస్మిక మృతి

📅 16 Dec 2025 ⏱️ 6:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సొర్సింగ్ జవాన్ గా పని చేస్తున్న గుర్రపు రాజన్న ( 55 ) ఆకస్మికంగా మృతి చెందారు. నిత్యం మాదిరిగానే ఉదయం డ్యూటీ కి వచ్చిన ఉద్యోగి చాతిలో నొప్పిగా ఉందని తోటి ఉద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెల్లిన అతను ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. జవాన్ మృతి చెందిన విషయం సమాచారం అందుకున్న మున్సిపల్ ఉద్యోగులు అతని ఇంటికి చేరుకున్నారు. రాజన్న మృతదేహానికి నివాళులు అర్పించారు. మున్సిపల్ తరపున కమీషనర్ గోపు గంగాధర్ రూ 10 వేయిలు, ఉద్యోగుల యూనియన్ తరపున రూ 5 వేయిలు అంత్యక్రియల కొరకు అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం భీంగల్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సున్నపు ఓంకార్ మాట్లాడుతూ.. చనిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 2001 నుండి గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్యాలయం లో జవాన్ గా పనిచేసిన రాజన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతి వార్త కార్మికులకు తీవ్ర బాధను మిగిల్చిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కార్మికులు అండగా ఉంటారని పేర్కొన్నారు.

Scroll to Top