PS Telugu News
Epaper

ముమ్మడివరంలో దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన శాసనసభ్యులు దాట్ల

📅 18 Mar 2026 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాయ నించే సూర్యుడు మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో*దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ అంకితభావం -దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభం ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో “దివ్యాంగ శక్తి” పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ఈ అద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేశారని తెలిపారు.
దివ్యాంగులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు, వారికి అవసరమైన సదుపాయాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందని తెలిపారు.ఈ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వివిధ రాయితీలు కల్పించడం ద్వారా వారి దైనందిన జీవితంలో సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో గుత్తులు సాయి చెల్లు వివేకానంద ఎక్స్ ఎమ్మెల్యే , నాగిడి నాగేశ్వరరావు, దాట్ల పృధ్వీరాజ్ ,ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లు అశోక్ గొల్ల కోటి దొరబాబు, తాడి నరసింహారావు, సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్ చిక్కాల అంజి, కూటమి పార్టీ నాయకులు , పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మరియు రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top