PS Telugu News
Epaper

ముమ్మిడివరం – కాట్రేనికోన వయా అయినాపురం రోడ్డుకు మహర్ధశ..

📅 27 Feb 2026 ⏱️ 4:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానా జీ అభివృద్ధి ప్రధాత దాట్ల సుబ్బరాజుకు అభినందనల వెల్లువ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన – అయినాపురం మధ్య రహదారి ఆధునీకరణతో స్థానికులకు ఊరట లభించింది. గత పదేళ్లుగా గుంతలతో దెబ్బతిన్న ఈ రహదారిపై ప్రయాణం వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాష్ట్ర విప్‌, స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ప్రత్యేక చొరవతో సుమారు 9.3 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.7.5 కోట్లు నిధులు సాధించారు. పనులు వేగంగా పూర్తి చేయించడంలో సోమిదేవరపాలెం వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కూడా కీలక పాత్ర పోషించారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం, పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయడం ద్వారా రహదారి నిర్మాణం వేగవంతమైంది. ఈ రహదారి ఆధునీకరణతో పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు సులభంగా ప్రయాణించగలుగుతున్నారు.నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటునందించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపిన అయినాపురం ప్రజలు.

Scroll to Top