మురుగునీటి మధ్య టిఫిన్ విక్రయాలు.. ప్రజల ఆరోగ్యంపై ఆందోళన

August 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు ఆగస్టు 3 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేటపట్టణంలోని పరమేశ్వర నగర్ ముందు గేటుకి ఆనుకొని ఉన్న ఓ టిఫిన్ సెంటర్ పరిసరాల్లో మురుగునీరు భారీగా నిల్వ ఉండటంతో స్థానికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ నీటిలో దోమలు విపరీతంగా పెరగడంతో పాటు దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంతమంతా అసహ్యకర వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనే టిఫిన్ విక్రయాలు కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం కోసం వచ్చే కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. పారిశుద్ధ్యం లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు ఎక్కడ చూసినా శుభ్రత లేని టిఫిన్ షాప్ లే పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి కానీ ఏ అధికారి కాకన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే అలాంటి టిఫిన్ సెంటర్ దగ్గరికి అధికారులు తినరు లేక ముడుపులు ముడుపులొస్తున్నావేమో ప్రజల ఆరోగ్యమే కదా పాడైపోయేది మనకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు బృందం ఇకనైనా సంబంధిత అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని శుభ్రత లేని రోడ్స్ సైడ్ టిఫిన్ బండ్లను తొలగించి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు కానీ ఇవన్నీ చూడాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు సూళ్లూరుపేటకి ఉన్నారా లేరా ఉంటే మనకు వచ్చేవి మనకొస్తాయిలే అని దీర్ఘంగా చైర్ లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారేమో ప్రజల ఆరోగ్యాలే కదా పాడేది మనకెందుకులే అనుకుంటున్నారేమో అని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు

🌐 Select Language:
📰 ePaper