
( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఫ్రూట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పండ్లు తీసుకుని రావడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ రకాల పండ్లను ప్రదర్శించి, వాటి యొక్క ఉపయోగాలు విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు జంక్ ఫుడ్ ను తీసుకోకుండా ప్రతిరోజు రకరకాల పండ్లను తీసుకోవాలని ఉపాధ్యాయులు వివరించారు. ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్ మరియు వాటి వల్ల విద్యార్థులకు కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వాజిద్, కరికులం డైరెక్టర్ వినోద్, ప్రిన్సిపాల్ ఆనంద్, వైస్ ప్రిన్సిపాల్ ఆసిఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.