యాడికిలో జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
పయనించే సూర్యుడు న్యూస్ 13 యాడికి మండల్ రిపోర్టర్ శర్మాస్ వలి
తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండగ పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణం నందు మంగళవారం ఉదయం సంక్రాంతి హరితలక్ష్మి ముగ్గుల పోటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడినది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి 167 మంది పాల్గొనగా 17 మంది మహిళలకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేసినారు. మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు ఇచ్చినారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి భూమా నాగరాగిణి హాజరైనారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి భూమా నాగరాగిణి మరియు వారి మిత్రబృందం న్యాయ నిర్ణెతలు గా వ్యవహరించినారు. సంక్రాంతి హరితలక్ష్మి పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారి వివరాలు మొదటి బహుమతి ఎం నాగలక్ష్మి.రెండవ బహుమతి సరిత. మూడవ బహుమతి శరణ్య నాలుగవ బహుమతి శిరీష ఐదవ బహుమతి రేణుకా దేవి ఆరవ బహుమతి వనజ ఏడవ బహుమతి నాగలక్ష్మి ఎనిమిదవ బహుమతి హేమలత
తొమ్మిదవ బహుమతి శ్రావణి పదవ బహుమతి రాజేశ్వరి 11వ బహుమతి అశ్విని 12వ బహుమతి రాజి
13వ బహుమతి వర్షిత 14వ బహుమతి మాదాన ఈశ్వరి 15వ బహుమతి జోష్ణ 16వ బహుమతి బిందుమతి
17వ బహుమతి మౌనిక బహుమతులు గెలుపొందిన వారికి తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి భూమ నాగరాగిణి మరియు దాతలు, శుభాకాంక్షలు తెలిపారు…ఈ కార్యక్రమం నకు సహకరించిన స్పాన్సర్లు దడియాల ఆదినారాయణ, డిపో రాజు అండ్ ఫ్రెండ్స్, గొర్తి రుద్రమ నాయుడు, స్టోర్ డీలర్ల సంఘం, జనసేన సునీల్ కుమార్,టెన్సింగ్ నాయుడు, తిరం పురం నీలకంఠ గుండా నారాయణస్వామి, కూన వెంకటస్వామి గన్నే రమేష్, వంగనూరు రాజశేఖర్,స్టాంపుల సూరి, దేవేంద్ర నాయుడు,సునీత పట్టు వస్త్రాలయం, వద్ది రాజశేఖర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, ఇండ్ల నందగోపాల్, వెలిగండ్ల ఆదినారాయణ,వెలిగండ్ల ఉపేంద్ర కోడూరు చంద్రశేఖర్ రెడ్డి,మారుతి సెల్ పాయింట్,వంకం నాగమయ్య, కుమ్మేత నాగేంద్ర, మారుతి ఎలక్ట్రానిక్స్, విశ్వం, నరేంద్ర డెకరేషన్స్,కడ్డీల నాగేంద్ర గారికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…..
