యాడికిలో సీసీ రోడ్ల నిర్మాణం.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
గౌరవ ఎమ్మెల్యే శ్రీ జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓంశాంతి కాలనీ,రాఘవేంద్ర కాలనీ, చెన్నకేశవ కాలనీ,వెంగమ నాయుడు కాలనీ లలో సి.సి.రోడ్ల నిర్మాణంపనులు శరవేగంగా జరుగుతున్నాయి.గుత్తేదారులుఈ రోడ్ల నిర్మాణం పనులను ప్రతిష్ణాత్మకంగా తీసుకొని ఆయా కాలనీలలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనిపట్ల ఆ కాలనీవాసులు ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ రోడ్ల నిర్మాణ పనులను డి.ఏ. ఏల్లమనాయుడు జే.ఏ.వరప్రసాద్, మరియు టి.డి.పి. నాయకులు వెలిగండ్ల ఆది నారాయణ,విశ్వం, రామచంద్ర,సుభాన్, నంద్యాల రంగస్వామి,ఉపేంద్ర, శివ,శివకోటి,బాబు పర్యవేక్షించారు.
