PS Telugu News
Epaper

యువత క్రీడ రంగాల్లో రాణించాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

📅 13 Jan 2026 ⏱️ 6:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సంక్రాంతి సందర్భంగా దేవుని బండ తండాలో దేవునిబండ తండా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)క్రికెట్ టోర్నమెంట్

అందరి సహకారం ఉంటే త్వరలోనే మీకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తా

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ముదావత్ శ్రీను

అందరూ మంచిగా ఆడాలి మన తాండకు మంచి పేరు తీసుకురావాలి

డిప్యూటీ సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్

( పయనించే సూర్యుడు జనవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

సంక్రాంతి సందర్భంగా దేవుని బండ తండా గ్రామపంచాయతీ లో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దేవుని బండ తండా సర్పంచ్ ముడవత్ శ్రీను గారు ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువత ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని నియోజకవర్గంలోనే మనది పెద్ద తండా అంటూ యువకులకు సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉద్యోగ రంగంలో వ్యాపార రంగాల్లో ఎదగాలని దానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటుందని వారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ బాదావత్ శ్యామ్లాల్ గారు గ్రామ సెక్రెటరీ గీతా గారు వార్డు సభ్యులు మరియు భోజనాల స్పాన్సర్ చందు టెంట్ హౌస్ స్పాన్సర్ సూర్య బ్యాట్ స్పాన్సర్స్ డి ఈశ్వర్ ఎం సురేష్ టీషర్ట్స్ జె నరేష్ పి బాలాజీ మేఘనాథ్ డిజె స్పాన్సర్ ఎం శంకర్ ఈవినింగ్ స్నాక్స్ స్పాన్సర్ ఏం పవన్ బి శంకర్ మరియు ఈ కార్యక్రమంలో ఆరు టీముల ప్లేయర్స్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు

Scroll to Top