యువమోర్చా నాయకులకు సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు ఘనసన్మానం
పయ నించే సూర్యుడు, ఫిబ్రవరి 7, 2026: ముమ్మిడివరం ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం అమలాపురం బీజేపీ కార్యాలయంలో యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన గనిశెట్టి అరవింద్కు, యువ మోర్చా జోనల్ ఇన్చార్జిగా ఎన్నికైన కొండేటి ఈశ్వర్ గౌడ్కు బిజెపి సీనియర్ నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు ముఖ్యఅతిథిగా హాజరైవారు ఇరువురికి ఘన సన్మానం ఏర్పాటు చేసారు. ఈ సన్మాన సభలో యువత అంతా సన్మార్గంలో నడిచి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన అన్నారు. బిజేపి సీనియర్ నాయకులు ఆర్.వి నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారందరూ యువమోర్చా నుంచి వచ్చిన వారేనని అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ యువత అంతా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, పేరాబత్తుల సుబ్బారావు, ఉప్పలగుప్తం మండల బీజేపీ అధ్యక్షుడు నల్లా సత్తిబాబు, పట్టణ బిజెపి నాయకులు అరిగిల తేజ వెంకటేష్, డేగల వెంకటరమణ పెద్దిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.