యూరియా, ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
పయనించే సూర్యుడు న్యూస్ గట్టుప్పల్ ఫిబ్రవరి 26.
యూరియా, ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువు రానటువంటి రైతులు ఆన్లైన్ బుకింగ్ విధానం ఏ రకంగా చేస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆయన అన్నారు. యూరియా పంపిణీకి ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు తప్పనిసరి చేయడంతో రైతులు స్మార్ట్ ఫోన్స్ లేవని బుకింగ్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం నెట్ సమస్యలు ఉండడం వల్ల నమోదు ప్రక్రియ కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాత విధానం ప్రకారం పాసుబుక్ ఆధారంగా రైతులకు యధావిధిగా యూరియా పంపిణీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం రైతుకు నష్టం కలిగించే మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ ను ప్రైవేటుకరించే విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం లోని అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించడం సరైనది కాదు అని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ బిల్లు, 2025 జి ఆర్ఎఎంజి ను రద్దు చేయాలని ఆయన అన్నారు.నిత్యవసర సరుకుల నియంత్రించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్ని, దీనివల్ల పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు, బహుల జాతి ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. పేదల సంపదను పెద్దలకు దోచి పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన అన్నారు. యూరియా ఆన్లైన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.వామపక్ష మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చాపల మారయ్య, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, పగిళ్ల శ్రీనివాస్, ఖమ్మం రాములు, పెద్దగాని నరసింహ, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, పడసబోయిన యాదగిరి, రైతు సంఘం నాయకులు ముసుకు బుచ్చిరెడ్డి, జి. విశ్వనాథ చారితదితరులు పాల్గొన్నారు.