రంగారెడ్డి జిల్లా సర్పంచ్ ల సమావేశం
కలెక్టర్ అతిథి గా విచ్చేసిన సర్పంచ్ ల కార్యక్రమం లొ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అన్నారం సర్పంచ్ లావణ్య రామక్రిష్ణ
( పయనించే సూర్యుడు మార్చి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా శంషాబాద్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామ సర్పంచ్ లావణ్య రామక్రిష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొని కలెక్టర్ సూచనలు మరియు మార్గదర్శకాలను వినిపించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం సర్పంచ్‌లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడం మరియు ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయంగా పనిచేయడం గురించి అవగాహన కల్పించడం.