PS Telugu News
Epaper

రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

📅 21 Mar 2026 ⏱️ 1:50 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ పండగ సందర్భంగా మన్నార్ పోలూరు దర్గాలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించు కుని సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ మన్నార్ పోలూరు దర్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రార్థనల్లో పాల్గొని, అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దానగుణం మరియు సోదరభావానికి రంజాన్ పండుగ ఒక గొప్ప ప్రతీక అని కొనియాడారు. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులందరికీ అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా సౌభాగ్యం వెల్లివిరియాలని అల్లాను ప్రార్థించినట్లు వారు తెలిపారు. మత సామరస్యానికి మన సూళ్ళూరుపేట నియోజకవర్గం ఒక నిదర్శనమని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపు కోవడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top