చింతూరు సబ్ డివిజన్ మరియు కుకునూరు,వేలేరుపాడు మండలను కలిపి నియోజకవర్గంగా ప్రకటించాలి.
- రంపచోడవరం చింతూరు సబ్ డివిజన్లను తూర్పుగోదరి (ప్లేయిన్)జిల్లాలో కలిపే మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్29()
రంపచోడవరం,పోలవరం నియోజకవర్గాలను,అలాగే చింతూరు సబ్ డివిజన్ ను నియోజకవర్గంగా ప్రకటించి మూడు నియోజకవర్గాలతో రంపచోడవరం కేంద్రంగా ఆదివాసి స్వాతంత్ర సమరయోధుడు కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ ప్రభుత్వాన్ని కోరారు.
అనిల్ మాట్లాడుతూ రంపచోడవరం,చింతూరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఉన్నందున దూరభారాలతో ఈ నియోజకవర్గాలను కొత్త జిల్లాగా ప్రకటిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఇదే క్రమంలో ఈ రెండు సబ్ డివిజన్లను చిన్న జిల్లా అవుతుందని, అందుకు ఇది ప్రత్యేక జిల్లా చేయడానికి వీలు కాదనే కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిపే ఉద్దేశంతో అధికారులు ఉన్నారని ఆ రకంగా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుందని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ముందు ఉంచారని కొన్ని పత్రిక మాధ్యమాల్లో వచ్చిందని,వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పోలవరం నియోజకవర్గాన్ని ఈ రెండు రెవెన్యూ డివిజన్లను కలిపి మూడు నియోజకవర్గాలతో ఆదివాసి స్వాతంత్ర సమరయోధుడు కారం తమన్న దొర పేరుతో కొత్త జిల్లా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వ సలహాదారులను అధికారులను ఈ సందర్భంగా కోరారు.

