రాజు వెడ్స్ రాంబాయి: విడుదలకు అడ్డంకులు ఉన్నాయన్న నిర్మాత ఆరోపణలు
పయనించే సూర్యుడు న్యూస్ :నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.10 కోట్ల కలెక్షన్లకు చేరువైందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోమంగళవారం (నవంబర్ 25) చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వేణు ఊడుగుల సంచలన కామెంట్స్ చేశారు. ‘మా సినిమా రివ్యూకు మేము పిలిచిన వాళ్ళు కాకుండా మరికొంతమంది వచ్చారు.. పిలవకపోయినా వచ్చారు కదా అని మేము ఏమీ మాట్లాడలేదు. కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక దర్శకుడికి అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. ఎన్నో కష్టాలు పడి సినిమాలు చేస్తాను. నచ్చకపోతే సినిమాకు రాకండి అంతేకానీ వచ్చిన తర్వాత మధ్యలో వెళ్లిపోయారు అవమానించకండి. వెళ్లిపోయిన వాళ్ళు ఊరికే ఉంటే బాగుండు ఆ తర్వాత రోజు నుంచి మా సినిమా మీద నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. మేము అడగలేదు మిమ్మల్ని సినిమాకి రమ్మని వచ్చిన వాళ్ళు నెగిటివ్ చేయాలని ఎందుకు. ఎన్నో కష్టాలు పడితే ఇలాంటి సినిమా ఒకటి రెడీ అయింది. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మాత్రం చేయొద్దు. ఇక దర్శకుడు సాయిలు కాంపాటి గురించి ఒక్క మాట చెప్తా.. తమిళ్ ఇండస్ట్రీకి వెట్రి మారన్, మారి సెల్వరాజ్ ఉంటే తెలుగు ఇండస్ట్రీకి సాయిలు కాంపాటి ఉన్నాడు’ అని వేణు ఊడుగుల చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టిన సిద్దూ జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్నప్పుడు ఈ సినిమా అవకాశం నాకు వచ్చింది. ఒక చిన్న సీన్ చేసి పంపిస్తే దర్శకుడు దాన్ని చూసి ఓకే చెప్పాడు. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా కష్టపడ్డాం. ఈరోజు నా క్యారెక్టర్ తో పాటు మిగిలిన వాళ్లకు కూడా వస్తున్న గుర్తింపు చూసిన తర్వాత పడిన కష్టం అంతా మర్చిపోయాం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థాంక్యూ’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘ సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఇందాకటి నుంచి అందరూ లేట్ అవుతుందా మీకు అని అడుగుతున్నారు.. కానీ ఒక కొత్త టీంకు ఇది ఎంత వాల్యుబుల్ వీడియో అనేది నాకు బాగా తెలుసు. మీ జర్నీలో నేను కూడా ఒక మెమోరీలో ఉన్నందుకు ఆనందంగా ఉంది. సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా చైతన్య జొన్నలగడ్డ గారు అద్భుతంగా నటించారు. కచ్చితంగా మీతో పాటు నటించే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. హీరో హీరోయిన్లు ఇద్దరు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా కంగ్రాజులేషన్స్. అందరూ చాలా హానెస్ట్ గా సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా అలాంటిదే. పని దైవం అని పనిచేస్తుంటే కచ్చితంగా దేవుడు ఎవరో ఒకరు రూపంలో వచ్చి మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. సాయిలు కాంపాటికి వేణు ఉడుగుల రూపంలో వచ్చినట్టు. నీది నాది ఒకే కథ సినిమా చేసే టైంలో చాలామంది దగ్గరికి ఆ కథ పట్టుకుని వెళ్తే రిజెక్ట్ చేశారు. ఆ కోపంతోనే ఈరోజు ఆయన నిర్మాతగా మారి సక్సెస్ కొట్టినట్టు ఉన్నారు. దర్శకుడుగానే కాదు నిర్మాతగా కూడా ఆయన కథల సెలెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు డైరెక్షన్ చేసిన చేయకపోయినా మీ కథలతో దర్శకులను పరిచయం చేయండి. మీ కథలు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలితో నేను నాలుగు సినిమాలు చేశాను అప్పుడే అనుకున్నాను మనోడు చాలా పెద్ద పొజిషన్కు వస్తాడు అని.. కాకపోతే కాస్త టైం పట్టింది ఇకనుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్, ఈటీవీ వాళ్లకు అందరికీ కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.