రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ప్రిన్సిపాల్ లక్ష్మీ జ్ఞానేశ్వరి
పయనించే సూర్యుడు నవంబర్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయితీ తూర్పు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల. అంగన్వాడి కేంద్రంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మీ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ రాజ్యాంగం అనేది మనకు దిక్చూచి లాంటిదని, ఈ రాజ్యాంగం భారత ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రా తత్వాన్ని ప్రసాదించిందని, మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నదని తెలిపారు. అలాగే కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకుడు బొజ్జా మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అన్ని కులాలు, మతాలు, భాష, సంస్కృతికి చెందిన ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంతో సహజీవనం సాగిస్తున్నారని, రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ శాంతియుతంగా సహజీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. కార్యక్రమానంతరం విద్యార్థినీ విద్యార్థుల చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేత్ర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు