రాధాకృష్ణపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి సూళ్లూరుపేటలో వైసీపీ ఆగ్రహం
పయనించేసూర్యుడు ఏప్రిల్ 10 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఏవీఎస్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సమాజాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది రాజకీయ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యక్తిగత లాభాలు పొందుతున్నారని విమర్శించారు. ఈ మేరకు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అజయ్ కుమార్కు అధికారిక ఫిర్యాదు సమర్పించారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమం లో జెట్టి వేణు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.