రాయికల్‌లో చత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి
స్వాభిమాన పోరాట యోధుడి జయంతి వేడుకలు విజయవంతం
ధైర్యానికి ప్రతీక… స్వాభిమానానికి చిహ్నం – శివాజీ జయంతి ఉత్సాహభరితం
“జై శివాజీ – జై భవాని” నినాదాలతో మార్మోగిన రాయికల్ గ్రామం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామంలో హిందూ హృదయ సమ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివాజీ మహారాజ్ వీరత్వం, ధైర్యసాహసాలు, స్వాభిమానం, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యాన్ని స్మరించుకున్నారు.యువత “జై శివాజీ – జై భవాని” నినాదాలతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఈ జయంతి వేడుకలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా, యువతలో దేశభక్తి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే స్ఫూర్తిదాయక వేదికగా నిలిచాయి.శివాజీ మహారాజ్ ఆశయాలు స్వాభిమానం,ధర్మరక్షణ,ప్రజాహితం ఈ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
