రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రస్తుత వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ సీనియర్ నేత, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దింశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంచినీటి పంపిణీ ప్రారంభించి పాదచారులకు మంచినుీరు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో పాదచారులకు, వాడపల్లి భక్తులకు ఈ మంచినీటి పంపిణీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మద్దింశెట్టి శ్రీనివాసరావు చేస్తున్న సేవాకార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కంకటాల వెంకటరత్నం (నాని), ఓబీసీ మోర్చ జిల్లా కార్యదర్శి బొర్రా ఆంజనేయులు గౌడ్, కముజు మహాలక్ష్మి రావు, దైవాల నాగేశ్వరరావు, నాగు, సత్తిబాబు, నారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు
