PS Telugu News
Epaper

రాష్ట్రంలో నే మొదటి గా పీతల హేచరీ ఏర్పాటు

📅 06 Mar 2026 ⏱️ 6:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన

దేశంలో పాండిచ్చేరి ప్రాంతంలో పీతల హేచరీ ఉందని, దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపెడ అధికారులు తెలియజేశారు. శుక్రవారం చిర్రయానం గ్రామంలో పీతల హేచరీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం రాష్ట్ర మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమలు రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రభుత్వం హ్యాచరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ, దానికంటే ముందుగా ప్రయత్నం చేసిన ప్రైవేటు పీతల హెచ్చరిక ప్రభుత్వం సుమారు 5 ఎకరాలు భూమి అందించిందని, ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఎంపెడ జెడి షణ్ముఖరావు మాట్లాడుతూ పాండిచ్చేరి ప్రాంతం నుండి పీతల సీడ్ తీసుకొచ్చేటప్పటికి దాంట్లో 70% నష్టపోతున్నారని, ఈ ప్రాంతంలో రైతాంగానికి సీడ్ అందుబాటులోకి తేవడానికి కృషి చేసిన సంస్థకు ప్రజాప్రతినిధులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల పవన్ ,విత్తనాల బుజ్జి, కాలాడి వీరబాబు ,అంగాన్ని నరసింహమూర్తి,మల్లాడి అన్నవరం,బొమ్మిడి సూరిబాబు, మార్రాజు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top