PS Telugu News
Epaper

రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందిన

📅 21 Mar 2026 ⏱️ 6:38 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

సాహితీ వేత్త నల్లా నరసింహమూర్తి ని సన్మానించిన ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావు

పయనించే సూర్యుడు మార్చి 21 ముమ్మిడివరం ప్రతినిధి: విజయవాడలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సాహితీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందిన సీనియర్ తెలుగు లెక్చరర్,శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు,”నడకకవి” నల్లా నరసింహమూర్తిని ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, అము డా చైర్మన్ అల్లా డ స్వామి నాయుడు, సన్మానించారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు భాషకు, ఆధునిక తెలుగు సాహిత్వాని కి చేస్తున్న నిరంతర సేవలను వారు ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం తీసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పునస్కార గ్రహీత నరసింహమూర్తి అన్నారు. తనను ప్రోత్సహిస్తున్న శాసనసభ్యులు ఆనందరావు కు కృతజ్ఞతలు తెలిపారు. కవులను సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిభను వెలికి తీస్తున్న మీరు సమాజానికి స్ఫూర్తి దాయకులు అని కవి నరసింహమూర్తి శాసనసభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో పెచ్చెట్టి విజయలక్ష్మి, కంకటాల రాంబాబు పాల్గొన్నారు.

Scroll to Top