
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు 11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం
అధికారులు ప్రజల ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం ముదిగొండ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు.ప్రజా ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కే కాదు రాష్ట్ర ప్రగతికి వేస్తున్న పునాదులను చూసి జిల్లా స్థాయి నాయకులే కాదు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నారని అన్నారు.రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని భావించి శ్రీమతి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.దురదృష్టకరం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది అన్నారు. ఆర్థికంగా, పాలన వ్యవస్థ ను పది సంవత్సరాల్లో విధ్వంసం చేశారని అన్నారు. వారి కుటుంబ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని తెలిపారు. వ్యవస్థలను ఎత్తివేసి, వారు సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, 24 గంటలు పనిచేసిన ఈ వ్యవస్థలను సర్ ఇది ఎందుకు సమయం సరిపోని పరిస్థితి నెలకొంది అన్నారు.అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసాం అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో నెలకు 11 వేల కోట్లు వడ్డీలు కట్టడానికే సరిపోయింది అన్నారు.ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి అన్న సంకల్పంతో 26 వేల కోట్ల అప్పును గత పాలకులు 11.50 శాతంతో తీసుకువస్తే ఆ వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాం అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఉప్పు, పప్పు ఏది కొనుగోలు చేసిన పన్ను చెల్లిస్తున్నారు వారి పన్నులతోనే అధికారులు ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నాం, గత పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఈ రాష్ట్ర ఖజానాలోని ప్రతి పైసాకు అధికారులు, ఉద్యోగ వ్యవస్థ జవాబుదారీగా ఉండాలి అన్నారు.ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేస్తే గత పాలకులు ఉద్యోగులకు సంబంధించిన 15 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పోయారు మా ప్రభుత్వం రాగానే నెలకు 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు.గత పది సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉపాధి హామీలో భాగంగా 100 రోజుల పనిలో చేపట్టే కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించే వారిని విమర్శించారు. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక బడి ఒక రోడ్డు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాష్ట్ర ప్రజలకు దక్కలేదు అన్నారు.కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, అటు గోదావరిపై లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగి పోయింది అన్నారు. లక్ష కోట్ల అప్పు తెచ్చారు అవి ఏమైపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అన్నారు.
దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు గత పాలకులు చంపేశారు, తిరిగి ఆ ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం జీవం పోస్తుందని తెలిపారు.మన ప్రభుత్వం వచ్చింది సరదాగా ఉందాం, నియోజకవర్గ ప్రజలతో సమయం కేటాయించి తిరుగుదాం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఏ ఒక్క నిమిషం వృధా చేసిన రాష్ట్రానికి నష్టం చేసిన వారం అవుతాం అని భావించి యావత్ క్యాబినెట్ సభ్యులు రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్నారు.ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను, అందుకే మధుర నియోజకవర్గ ప్రజలకు వారు కోరుకున్న మేరకు సమయం కేటాయించలేకపోతున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మధుర నియోజకవర్గ ప్రజల విలువైన ఓటును వినియోగిస్తున్నానని అన్నారు.తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల ఖాతాల్లో జమ చేసి దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించింది అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది అన్నారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం, పేదవాని కళ్ళల్లో ఆనందం చూసి ఇందిరమ్మ ప్రభుత్వం తన్వాయం చెందుతుంది అన్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు సన్నధాన్యం సాగు చేసిన రైతులకు కింటాకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 51 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేసేందుకు సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించి మొదటి సంవత్సరం లక్ష్యానికి మించి 21,635 కోట్లు పొట్టి లేని రుణాల మొత్తం మహిళా సంఘాలకు అందజేశామని తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది బిడ్డల చదువు ప్రజా ప్రభుత్వం బాధ్యత, రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను 40% కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా ప్రపంచ స్థాయిని విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో పాఠశాలను 200 కోట్లతో నిర్మిస్తున్నామని రాష్ట్రంలో ఒకేసారి 14 పాఠశాలల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
