రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో విజయాలు సాధించిన ఏర్గట్ల విద్యార్థిని
పయనించి సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పద్మశాలి ముద్దుబిడ్డ జక్కని వైష్ణవి రాష్ట్రస్థాయి నిర్వహించిన నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో కళాత్మక ప్రతిభను పెంపొందించేందుకు సాహిత్య అకాడమీ రాష్ట్రవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. రాష్ట్రస్థాయిలో వైష్ణవి రెండు విభాగాల్లో ప్రతిభ చాటడం పాఠశాలకి గర్వకారణమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు పలు రంగాలలో ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతున్న విద్యార్థినని తెలిపారు. త్వరలో రవీంద్రభారతిలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా బహుమతులు స్వీకరించనుందని చెప్పారు. వైష్ణవిని సాహిత్య రంగంలో ప్రోత్సహించి మార్గదర్శనం చేస్తున్న తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ కృషిని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం వైష్ణవి, అలాగే ప్రవీణ్ శర్మ లకు అభినందనలు తెలిపారు.
