రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలకు వికారాబాద్ క్రీడాకారులు సిద్ధం: శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS.
జనం న్యూస్ 17 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా సైబరాబాద్
కమిషనరేట్ పరిధిలో రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించనున్న “4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026” పోటీలకు చార్మినార్ జోన్ తరపున వికారాబాద్ జిల్లా నుండి ఎంపికైన క్రీడాకారులతో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో క్రీడాకారులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, క్రమశిక్షణతో ఆడి జిల్లాకు, ఛార్మినార్ జోన్ కు మంచి పేరు తీసుకురావాలని తెలిపినారు.కేవలం గెలుపు ఓటములే ప్రధానం కాదని, క్రీడా స్ఫూర్తితో పాలుపంచుకోవడం ముఖ్యమని తెలిపినారు. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి క్రీడాకారుడికి ఆమె వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తూ, వారికి అవసరమైన అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి గ్రూప్ ఫోటో షూట్‌లో పాల్గొని వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్‌ఐ లు డేవిడ్ విజయ్ కుమార్, శ్రీశైలం, నాగరాజు,ఆర్‌ఎస్‌ఐ లు , సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.